అమెరికాతో థ్రిల్లర్.. ఆఖరి నిమిషంలో నెగ్గిన టర్కీ
ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup)లో టర్కీ తొలి విజయాన్ని నమోదు చేసింది. వాస్తవానికి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఆ జట్టు .. లాస్ ఏంజిల్స్ స్టేడియంలో హోస్ట్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 3-2 గోల్స్ తేడాతో నెగ్గింది. గ్రూప్ డీ మ్యాచ్‌లో మొత్తం అయిదు గోల్స్ నమోదు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడినా.. ఆ గ్రూపులో మాత్రం ఆ దేశమే అగ్రస్థానంలో ఉన్నది. ఆట ప్రారంభమైన మూడు నిమిషాలకే అమెరికా ప్లేయర్ ఆస్టన్ ట్రస్టీ గోల్ కొట్టాడు. డీప్ కార్నర్ నుంచి సెబాస్టియన్ అందించిన పాస్‌ను లెఫ్ట్ ఫూట్‌తో ట్రస్టీ గోల్‌గా మలిచాడు. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయినా.. అమెరికాతో మ్యాచ్‌లో మాత్రం...