ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన తెలుగుపల్లి సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు
తెలుగుపల్లి గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు ఓటరు నమోదు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో కొత్త ఓటరు ఒక్కరు కూడా మిస్ కాకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే, మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించడం, ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నట్లయితే, వాటిని ఒకే చోటికి...