నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన మరియు బహిరంగ సభను విజయవంతం చేయాలని మేడ సైదులు పిలుపు.

దేవరకొండ 27జూన్ (BVK 3 న్యూస్ ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారి ముఖ్య అనుచరులు, యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ సైదులు పేర్కొన్నారు. ​రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'తెలంగాణ రైసింగ్ 2047' నినాదంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, మెట్రో రైలు విస్తరణ, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం, మహిళా సంఘాలకు వడ్డీ...