నల్లగొండ జిల్లాలో ప్రజా సంఘాల నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్న ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ.

​ దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను తెలియజేయడానికి సిద్ధమవుతున్న విద్యార్థి మరియు ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ​ఈ సందర్భంగా బుడిగా వెంకటేష్, ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ: ​ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, నిరసన తెలపడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని అన్నారు. ​ముఖ్యమంత్రి పర్యటన సాకుతో తెల్లవారుజామునే నాయకుల ఇళ్లకు వెళ్లి, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని దేవరకొండ పోలీస్...