జోర్డాన్‌పై అర్జెంటీనా ఘన విజయం..
ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ ‘జె’ చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 3-1 తేడాతో జోర్డాన్‌పై ఘన విజయం సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ బెంచ్‌కే పరిమితమైనప్పటికీ, ద్వితీయార్థంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చి అద్భుతమైన ఫ్రీ-కిక్ గోల్‌తో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ గోల్‌తో ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడిగా మెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.