అనిరుధ్-కావ్య మారన్ పెళ్లిపై అఖండ 2 న‌టుడు ఆసక్తికర వ్యాఖ్యలు..

కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత కావ్య మారన్‌ల వివాహంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవుతారనే ప్రచారం సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పుకార్లపై తాజాగా ప్రముఖ తమిళ నటుడు, నాటకరంగ దిగ్గజం వై.జి. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీశాయి. ఒక తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న వై.జి. మహేంద్రన్, అనిరుధ్ వ్యక్తిత్వం, కావ్య మారన్ వ్యాపార నైపుణ్యాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అనిరుధ్ ఎంతో మృదుస్వభావి, ప్రతిభావంతుడైన యువకుడని ఆయన కొనియాడారు.City &...