ఆరోగ్యం.. ఇప్పుడు ‘ట్రాకర్ల’మయం

డాక్టర్లు, రిపోర్టులు కాదు... చిన్న చిన్న గ్యాడ్జెట్లు దేహదృఢత్వాన్నీ, ఆరోగ్యస్థితినీ అంచనా వేస్తున్నాయి. వాచీలూ, ఉంగరాలూ, ప్యాచ్‌లూ, బడ్స్‌ రూపంలో ఈ ‘వేరబుల్‌ స్మార్ట్‌ ట్రాకర్లు’ (శరీరానికి పెట్టుకునే పరికరాలు) ఒదిగిపోతున్నాయి. రోజువారీ నడిచే అడుగులు, గుండె కొట్టుకునే పద్ధతి, నిద్ర నాణ్యత, రికవరీ స్కోరు లాంటి డేటాను ఇవి రియల్‌ టైమ్‌లో చూపిస్తున్నాయి. ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ, హెచ్చరికలు చేస్తున్నాయి. ఆబాలగోపాలం స్మార్ట్‌ ట్రాకర్ల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై ఓ ఫోకస్‌... అరవై ఏళ్ల వయసున్న రాజేంద్రకు ఆయన కొడుకు ఒక ప్రముఖ బ్రాండ్‌ స్మార్ట్‌ వాచ్‌ను కానుకగా ఇచ్చాడు. ఒకరోజు రాత్రి రాజేంద్ర నిద్రపోతున్నపుడు...