దేవరకొండ పట్టణంలో రూ. 1.42 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా 11 మరియు 12వ వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నగరాభివృద్ధి నిధుల నుండి రూ. 1 కోటి 42 లక్షల 25 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. "ప్రజలకు మెరుగైన రహదారులు, స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ మరియు విద్యుత్ వంటి...