పల్స్ పోలియో కార్యక్రమంలో శాతవాహన లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం - అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్: సుధ రాజేంద్ర
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఉచిత పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పోలియో చుక్కల పంపిణీ నిర్యహణలో శాతవాహన లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు రీజియన్ చైర్మన్ లయన్ వడపకాపురం జగదీశ్వరాచారి చొరవతో వైద్య సిబ్బందికి ఉచితంగా 600 విజిటెబుల్ బిర్యానీ, పెరుగు, మంచి నీటి బాటిల్స్ అందించడం ప్రశంసనీయమని అదనపు డిఎంహెచ్‌ఓ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్: సుధ రాజేంద్ర కొనియాడారు. ఈ రోజు బుట్టి రాజారాం కాలనీ రూరల్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పోలియో చుక్కల పంపిణీ సిబ్బందికి ఆహారపు ప్యాకెట్లు, మినరల్ వాటర్ బాటిల్స్, పెరుగు ప్యాకెట్లను పంపిణీ చేసిన...