22 రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు..

రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం దేశంలోని 22 రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. ఇవాళ యూపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, గతేడాది కంటే 9 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు యూపీలోకి ఎంట్రీ ఇస్తున్నాయని వెల్లడించింది. గత 16 రోజులుగా బిహార్‌ సరిహద్దు వద్దే రుతుపవనాలు ఆగిపోయాయని ఐఎండీ తెలిపింది. రాజస్థాన్‌ సహా ఏడు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా నమోదు అవుతున్నాయని వెల్లడించింది. రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు...