ఆఖరి బంతికి సిక్స్ .. హీరోగా నిలిచిన భారత సంతతి క్రికెటర్

సాధారణంగా సాగే మ్యాచుల్లో ఏ జట్టైన విజయం సాధిస్తే...ఆ క్రెడిట్ ఆటగాళ్లందరికీ చేరుతుంది. అయితే ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌లో మాత్రం ఎవరు గెలిపిస్తే వారు హీరోగా మారుతారు. అలానే భారతి సంతతి క్రికెటర్ కూడా అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్2026లో హీరోగా నిలిచాడు. టెక్సాస్ సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడ‌మ్ ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజ‌యాన్ని అందుకుంది. భార‌త సంత‌తికి చెందిన నిఖిల్ చౌద‌రీ (27*) ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి వాషింగ్టన్ ఫ్రీడ‌మ్‌ను గెలిపించాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూప‌ర్‌కింగ్స్ 20 ఓవ‌ర్లలో 4 వికెట్ల కోల్పోయి 185 ప‌రుగులు చేసింది....