షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ రహదారి-48పై శనివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి కారులో వెళుతూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాంబుతో ఆమెను బెదిరించాలనుకున్నాడు. అయితే క్షణాల వ్యవధిలో ఆమె దిగిపోవడంతో తాను ఒక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ కూడా ప్రాణాలతో బయటపడ్డాడు (Karnataka car blast). బెంగళూరలో నివాసం ఉంటున్న రమ్యా ఉల్లాస్ అనే యువతి స్థానిక సంజయ్ గాంధీ హాస్పిటల్‌లో ఓటీ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. ఆమె ఆరేళ్లుగా నాగేంద్ర అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే ఇటీవల వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో నాగేంద్ర నంబర్‌ను ఆమె బ్లాక్‌లో పెట్టి...