19వ వార్డులో విజయవంతమైన పోలియో చుక్కల కార్యక్రమం
దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం దేవరకొండ పట్టణంలోని 19వ వార్డులో అత్యంత ఉత్సాహంగా, విజయవంతమైనది.5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా వారిని భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడకుండా రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా RP జ్యోతి,ఆశా కార్యకర్త లక్ష్మి,వాలంటరీలు ప్రశాంతి,శైలజ పాల్గొని, తమ వార్డు పరిధిలోని చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,"పోలియో రహిత సమాజమే మా లక్ష్యం.ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు సకాలంలో పోలియో చుక్కలు...