చీటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ...తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మొద్దు. ...తెలియని వ్యక్తులకు డబ్బులు, వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. ...మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నారాయణపేట, జూన్ 28 (బి వి కే న్యూస్) ప్రస్తుత సమాజంలో వివిధ రూపాల్లో జరుగుతున్న చీటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఒక ప్రకటనలో తెలిపారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బంగారం, స్థలాలు, ఆన్‌లైన్ వ్యాపారాలు, లక్కీ డ్రాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు,...