పెను విషాదం.. మలేరియా సోకి ముగ్గురు చిన్నారుల మృతి

జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మలేరియా కారణంగా ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 48 గంటల్లో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవటం, మరి కొంతమంది మలేరియా బారినపడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా వైద్యాధికారులు ఆదివారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. ఈస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలోని పలు గ్రామాల్లో మలేరియా పెచ్చు మీరి విలయతాండవం చేస్తోంది. పోత్క, దౌద్రోదియా, కందర్ గ్రామాల్లోని 20 మందికి పైగా మలేరియా బారినపడ్డారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు కావటం గమనార్హం. మలేరియా మెదడుకు వ్యాపించటం(సెరిబ్రల్ మలేరియా)తో పీఎం శ్రీ కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న లక్కీ...