ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సింది.

భారత క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే అద్భుత ప్రదర్శనలతో సీనియర్ జట్టులో చోటు సంపాదించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. కాగా సీనియర్ ప్లేయర్లు పూర్తిగా విఫలమవ్వడంతో.. వైభవ్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. వైభవ్ ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసి ఉంటే బాగుండేదని వెల్లడించాడు. ‘వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ సిరీస్‌లోనే అవకాశం ఇవ్వాలని నేను భావించాను. ఈ రెండు మ్యాచుల్లో అతడిని ఆడించి ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌కు మంచి...