జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు.
విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూవివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి సంబంధించిన భూమి రికార్డులను తారుమారు చేసి, ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపించే ప్రయత్నించారని అన్నారు. ఈ అంశంపై తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా స్థలానికి సంబంధించిన రికార్డులను మార్చేశారు. అసలు ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా ఎలా మార్చగలిగారు?’ అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు....