ఓ మనిషి నీక్రమశిక్షణే నీ ప్రగతి పథం

ఓ మనిషి ఆశయం ఉన్నంత మాత్రాన సరిపోదు ఆచరణలో పెట్టే క్రమశిక్షణ నీ జీవన శైలి కావాలి క్రమశిక్షణ అనేది నీఊహలకు నీవుసాధించే విజయానికి మధ్య వారధి ఆశలు ఆకాంక్షలు నెరవేరి ఆశయాలశిఖరాన్ని చేరాలంటే ఆలోచనలకు పదును పెట్టాలి లక్ష్యసాధన వైపు సాగాలంటే క్రమశిక్షణే ఆయుధంగా పట్టుదలే పెట్టుబడిగా నిరంతర కృషియే ధ్యేయంగా ముందుకు సాగాలి నియమం లేని ప్రయాణం గమ్యం లేని నావ అవుతుంది శ్రమతత్వ గుణమే నీ జీవితాన్ని మార్చుతుంది సమయపాలన నీ శ్వాస కావాలి విశ్వసనీయత నీ మాట కావాలి సత్ప్రవర్తన నీ బాట కావాలి అప్పుడే విజయాలు నీవశమౌతాయి సోమరితనం వదిలి పెట్టు స్వయం కృషితో ఎదుగు క్రమశిక్షణే నీఎదుగుదలకు...