నేదునూరి మాట

కదిలే బంధాలు కరిగే గుండెలు శాస్త్ర సాంకేతికత పెరిగి ఆధునిక విలాస జీవితాన్ని అనుభవిస్తున్న మానవుడు గోడల మధ్యన మనసులులేని మనుషుల మధ్య ఒంటరిగా జీవిస్తున్నాడు ఒకే ఇంటిలో అందరు జీవిస్తున్న ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లు ప్రత్యేక ఆలోచనా ప్రపంచంలో మునిగి పోతున్నాడు మనుషుల గుండెల మధ్యన దూరాలు పెరుగుతున్నాయి మాట మంచి ఓపికలు ఓదార్పు నశించి పరనింద సంస్కృతి రాజ్యమేలుతుంది ఒంటరితనం తనం ఇంటింట వటవృక్షంలా పెరుగుతోంది కుటుంబ బంధాలు బీటలు వారి బంధాలు అనుబంధాలు అడ్రస్ లేనివై అందరు ఉన్న అనాథల సంఖ్య పెరుగుతోంది వృద్ధాశ్రమాలే శరణ్యమై సామాజిక పునాదుల్ని కదిలించే కలియుగ కలుషిత స్థితి ప్రభలడం శోచనీయం నేటి...