ఉద్యమకారుల సంక్షేమం కోసం జూలై 2న ‘చలో ఉప్పల్ భగాయత్’ - పోస్టర్ ఆవిష్కరించిన టిఆర్ఎస్ దేవరకొండ ఇంచార్జ్ నేనావత్ శివ నాయక్

దేవరకొండ 29జూన్ (BVK 3 న్యూస్ ) :తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం చేపట్టిన ‘భూ పోరాటం’లో భాగంగా, జూలై 2న ‘చలో ఉప్పల్ భగాయత్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట కవితమ్మ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా, సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జ్ నేనావత్ శివ నాయక్ పాల్గొని, ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా శివ నాయక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఉద్యమకారుల త్యాగాలను విస్మరించడం దురదృష్టకరమని పేర్కొంటూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి కింది డిమాండ్లను...