జిల్లా ఎస్పీ నీ కలిసిన ఆఫీస్ సూపరింటెండెంట్ శ్యామ్ సుందర్ రాజు
నారాయణపేట, జూన్ 29 (బివికే న్యూస్) నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో నూతన ఆఫీస్ సూపరింటెండెంట్‌గా శ్యామ్ సుందర్ రాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నేడు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. శ్యామ్ సుందర్ రాజు తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) 10వ బెటాలియన్ నుంచి బదిలీపై నారాయణపేట జిల్లా డీపీఓ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, ఐపీఎస్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లా పోలీసు శాఖ పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని సూచించారు. కాగా, ఇంతకుముందు నారాయణపేట...