సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్న అధికారుల నిర్లక్ష్యం

తెలంగాణ కమిషనర్ ఆదేశాలను లెక్కచేయని అధికారులు దేవరకొండ 30జూన్ (BVK 3 న్యూస్ ) : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చట్ట స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని సమాచార హక్కు చట్టం రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి పగిడిమర్రి యాదగిరి ఒక ప్రకటనలో ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని నాలుగు గ్రామాలు సిద్దాపురం, మన్నేవారి పల్లి, ఐనోల్, బొమ్మన్ పల్లి సంబంధించిన సమాచారాన్ని కోరుతూ 15 నెలల(465రోజులు) క్రితం ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు సమాచారం అందించలేదని తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ స్పందించి జూన్ 29న సంబంధిత రికార్డుల...