శ్రీ సాయి రాఘవేంద్ర నగర్‌లో విద్యుత్ పరికరాల చోరీ: దేవరకొండ పోలీసులకు సర్పంచ్ ఫిర్యాదు

దేవరకొండ 30జూన్ (BVK 3 న్యూస్ ) : మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ సాయి రాఘవేంద్ర నగర్ వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ పరికరాలను చోరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వెంచర్‌లో విద్యుత్ స్తంభాలకు ఉన్న కాపర్ వైర్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్లలోని విలువైన పరికరాలను దుండగులు అపహరించుకుపోయారు. ​ఈ చోరీ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్, వెంటనే స్పందించి దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవరకొండ సి.ఐ. వెంకట్ రెడ్డి గారికి జరిగిన ఘటన వివరాలను అందజేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు....