పూర్వీకుల స్మరణలో72 గంటల కఠోర మౌన దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన ఎస్. రాము చౌహన్

దేవరకొండ 30జూన్ (BVK 3 న్యూస్ ) : తెల్దేరిపల్లి గ్రామానికి చెందిన, మలక్‌పేట ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎస్. రాము చౌహన్ , తమ వంశపారంపర్య పూర్వీకులను స్మరించుకుంటూ, వారి ఆశీస్సులు పొందేందుకు అత్యంత కఠోరమైన మౌన దీక్షను చేపట్టారు. ​తన తాతగారైన శ్రీశ్రీశ్రీ సేవ్య సాద్ భగవాన్ వారి స్ఫూర్తితో, స్థానిక శ్రీ బాలాజీ మందిరంలో ఆయన వరుసగా 72 గంటల పాటు నిరంతర మౌన దీక్షను నిర్వహించారు. కఠిన నియమ నిబంధనలతో సాగిన ఈ ఆధ్యాత్మిక దీక్షను ఆయన నేడు విజయవంతంగా విరమించారు. ​ఈ సందర్భంగా శ్రీ రాము చౌహన్ మాట్లాడుతూ... ​"మన పూర్వీకులు మనకు అందించిన సంస్కృతి,...