ప్రభుత్వ పాఠశాలలకు విద్యా వాలంటీర్లను వెంటనే నియమించాలి
ఎంఈఓ కు ఏబీవీపీ వినతి నారాయణపేట, (మక్తల్) జూలై 1 (బి వి కే న్యూస్) 2026 -27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలలో విద్యా వాలంటీర్ల నియామకాలను వెంటనే చేపట్టాలని బుధవారం మక్తల్ పట్టణంలోని మండల విద్యాధికారి అభివృద్ధిని ఏబీవీపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్ మాట్లాడుతూ మఖ్తల్ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు విద్యా వాలంటీర్ పోస్టులను తక్షణమే...