వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
- వైద్యులకు సన్మానం గావించిన వాసవి క్లబ్ అధ్యక్షుడు హరికృష్ణ ఇతర సభ్యులు నారాయణపేట, (మక్తల్) జూలై 1 (బి వి కే న్యూస్ ) వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్స్ డే కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ పట్టణంలో గల స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్లను ఘనంగా సన్మానించడం జరిగింది. వాసవి క్లబ్ అధ్యక్షులు హరికృష్ణ మాట్లాడుతూ.. వైద్యులు మన ప్రాణాలను కాపాడే దేవుళ్ళు. వారు సమాజానికి చేస్తున్న నిస్వార్థ సేవలను, త్యాగాలను గుర్తించి గౌరవించడానికి 'డాక్టర్స్ డే' (జాతీయ వైద్యుల...