సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

- డాక్టర్ మణికంఠ గౌడ్ ను సన్మానించిన జిల్లా సైకిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం నారాయణపేట, (మక్తల్) జులై 1 (బీవీకే న్యూస్ ) జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్ ను ప్రధాన కార్యదర్శి బి.గోపాలం, ఉపాధ్యక్షుడు జి. శివకుమార్ ఈనెల 1 న ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా బి.గోపాలం మాట్లాడుతూ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ వైద్యుడు డాక్టర్ భిధాన్ చంద్రరాయ్ జయంతి జులై 1న, భారతదేశమంతట ఘనంగా వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారని, మన భారత ప్రభుత్వం 1991 జులై 1 నుండి జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోవడానికి...