యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం సూచనల ప్రకారం 100% తృప్తిని సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలి
- జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక - విద్యాభరమైన సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణపేట, (నర్వ) జూలై 1 (బి వి కె న్యూస్ ) నర్వ యాస్పరేషన్ బ్లాక్‌లోని ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు , సామాజిక అభివృద్ధి రంగాలలో కీలకమైన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ (ABP) సూచికల ప్రకారం వంద శాతం సంతృప్తిని సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు. బుధవారం కలెక్టర్ నర్వ యాస్పరేషన్ బ్లాక్ పర్యటనలో భాగంగా ఆ మండలంలోని పాతర్ చేడ్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు చెందిన అటల్ టింకరింగ్...