విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్: ప్రతి బుధవారం చికెన్ భోజనం ఇస్తామని హామీ

దేవరకొండ 02 జూలై (BVK 3 న్యూస్ ) : గుడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు ఒక ప్రత్యేక కార్యక్రమం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు పాఠశాలను సందర్శించి, విద్యార్థిని విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజన నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, వారి చదువుల గురించి మరియు పాఠశాల అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని నింపేందుకు, వారిలో పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి బుధవారం తన సొంత నిధులతో విద్యార్థులందరికీ చికెన్ భోజనాన్ని ఏర్పాటు చేస్తానని సర్పంచ్ గారు హామీ...