గుడిపల్లిలో రైతులకు ఉచిత పత్తి విత్తనాల పంపిణీ
దేవరకొండ 02 జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమం గురువారం గుడిపల్లి రైతు వేదిక నందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిపల్లి సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై, రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, "రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి విత్తన రాయితీలను, పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధించాలని" ఆయన ఆకాంక్షించారు. అలాగే, పంటల సాగులో రసాయన క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటంలో...