దేవరకొండలో ఘనంగా మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) అకాడమిక్ కౌన్సిల్ సమావేశం

దేవరకొండ 02 జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ కౌన్సిల్ సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి చైర్పర్సన్‌గా అధ్యక్షత వహించారు. కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య మెంబర్ సెక్రటరీగా వ్యవహరించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్, బోధన–అభ్యాస విధానాలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, పరీక్షల నిర్వహణ, పాఠ్యాంశాల అమలు, నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా పలు కీలక నిర్ణయాలను...