చందంపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లారెడ్డి బాధ్యతల స్వీకరణ - సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నేనావత్ భరత్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
దేవరకొండ 02 జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నేనావత్ బాలునాయక్ గారి ఆదేశానుసారం, చందంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చందంపేట మాజీ ఎంపీపీ ఏడుపుల గోవింద్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చందంపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు మల్లారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, దేవరకొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హరికృష్ణ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బధ్యా నాయక్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: సన్మాన కార్యక్రమం:...