బాలుడి ప్రాణం తీసిన గబ్బిలం..
గబ్బిలం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. రేబీస్ వ్యాధి సోకి కెనడాకు చెందిన 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గబ్బిలం బాలుడి ముఖంపై వాలడం కారణంగా అతడికి రేబీస్ సోకింది. 2 నెలల్లోనే బాలుడు చనిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే.. 2024లో 11 ఏళ్ల ఓ బాలుడు సమ్మర్ వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలసి ఒంటారియో వెళ్లాడు. ఓ రోజు ఉదయం అతడు నిద్రలేవగానే.. ముక్కు, నోరుపై గబ్బిలం వాలి ఉండటం గమనించాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన బాలుడు భయంతో దాన్ని పక్కకు తోసేశాడు.