ప్రతి ఒక్క ఓటు అవసరమే: ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్
దేవరకొండ 02 జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ కార్యక్రమంపై అవగాహన సదస్సు దేవరకొండ నియోజకవర్గం, కొండమల్లేపల్లిలో నిర్వహించిన 'ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ అవగాహన సదస్సు'లో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొని ప్రసంగించారు. సదస్సులోని ముఖ్యాంశాలు: BLAల బాధ్యత: ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లపై (BLAలు) ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చాలని సూచించారు. యువతకు ప్రాధాన్యత: కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత పేర్లను నమోదు చేయడంతో పాటు, ఓటరు జాబితాలో ఉన్న...