దేవరకొండ చేనేత సహకార సంఘం ఎన్నికల సందడి: నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

దేవరకొండ 02 జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ చేనేత సహకార సంఘం పాలకవర్గ ఎన్నికల ప్రక్రియకు నాంది పడింది. గురువారం నుంచి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రారంభించారు.తొలి నామినేషన్ దాఖలు ఎన్నికల అధికారి నామ భాస్కర్ ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో, చేరిపల్లి బాలరాజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించి ఎన్నికల బరిలో నిలిచారు. ముఖ్యంగా, దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు ఈ నామినేషన్‌ను బలపరచడం గమనార్హం. బాలరాజుతో పాటు, పాలకవర్గ సభ్యత్వ స్థానాలకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న మరో ఎనిమిది మంది...