రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ 02 జూలై (BVK 3 న్యూస్ ) : పీఏపల్లి మండలం, అంగడిపేట రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు ఉచిత పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పాల్గొని రైతులకు ఉచిత పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుల సాగు వ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించేలా నాణ్యమైన ఉచిత పత్తి విత్తనాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రైతులకు...