సాయి, పడిక్కల్ హాఫ్ సెంచరీ..
రెండో అనధికారిక టెస్టులో భారత- ఏ బ్యాటర్ల దంచేస్తున్నారు. గాలే స్టేడియంలోఓపెనర్ సాయి సుదర్శన్ (87 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్(74 నాటౌట్) అర్ధ శతకాలతో కదం తొక్కారు. శ్రీలంక ఏ బౌలర్లను ఉతికేసిన ఈ ద్వయం శతక భాగస్వామ్యం నెలకొల్పగా ఇండియా-ఏ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. సెంచరీకి చేరువైన వీరిద్దరూ.. చేతిలో మరో తొమ్మిది వికెట్లు ఉండడంతో ఆతిథ్య జట్టు స్కోర్‌ను దాటేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లడం ఖాయం. శ్రీలంక పర్యటనలో భారత -ఏ జట్టు ధీటుగా ఆడుతోంది. తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగియడంతో రెండో మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా ఇండియా-ఏ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. లంక ఏ బౌలర్లను బెంబేలెత్తిస్తూ ఓపెనర్ సాయి సుదర్శన్(87...