ధోని, జకోవిచ్‌లో ఓ అరుదైన గుణం ఉంది

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని, టెన్నిస్ స్టార్ ప్లేయర్ జకోవిచ్‌ల గురించి టీమిండియా మహిళా పేసర్ దీప్తి శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరిలో ఓ అరుదైన గుణం ఉందని తెలిపింది. ఎంతటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకునే అరుదైన లక్షణం వీరిద్దరిలో ఉందని దీప్తి శర్మ వెల్లడించింది. వింబుల్డన్ టోర్నీకి వెళ్లిన దీప్తి.. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మాట్లాడింది. ‘జకోవిచ్ ప్రస్తావన వస్తే అందరూ ముందుగా అతడి మానసిక దృఢత్వం గురించే చెబుతుంటారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా అతడు పోరాటం మాత్రం ఆపడు. క్రికెట్‌లో ఇలాంటి లక్షణాలు ఎంఎస్ ధోని సర్‌లో కనిపిస్తాయి. ఆయన కూడా...