రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్
సమర్థవంతమైన పోలీసింగ్, క్రమశిక్షణ, ప్రజలకు జవాబుదారీతనం పెంపుపై డీజీపీ దిశానిర్దేశం నారాయణపేట, జులై 3 (బివికె న్యూస్) తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో సమర్థవంతమైన పోలీసింగ్ ప్రమాణాల అమలు, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంపు లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ C. V. ఆనంద్ నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS జిల్లా పోలీసు అధికారులతో కలిసి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ పోలీసు అధికారులు ప్రజలకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుత వైఖరి పాటించాలని, పాత విధానాలను వదిలి...