News ప్లాష్ ఛేహించండి సార్

కాలువ పూడికతీత పనుల ప్రారంభం.. ప్రారంభించిన మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి నారాయణపేట, జులై 33 (బివికే న్యూస్) మక్తల్ పట్టణంలోని డొంగుల ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో మురుగునీటి కాలువ పూడికతీత పనులను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సోదరుడు, మక్తల్ మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి శుక్రవారం ప్రారంభించారు. మక్తల్ మున్సిపాలిటీ 4వ వార్డులోని డొంగుల ఆంజనేయస్వామి దేవాలయం ముందు ఉన్న మురుగునీటి కాలువలో మట్టి, పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగునీరు పొలాల్లోకి చేరడంతో పాటు ఆలయం ముందు నిలిచిపోతుందని స్థానికులు వాకిటి శేషగిరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు...