ఘనంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ జన్మదిన వేడుకలు: అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న ఎమ్మెల్యే!
దేవరకొండ 03జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పున్న కైలాష్ నేత ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే బాలు నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారితో పాటు వారి సతీమణి శ్రీమతి...