దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారి జన్మదినం సందర్భంగా ఘనంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం

దేవరకొండ 03జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలునాయక్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజానికి అవసరమైన సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా చేయడం, యువతలో రక్తదానంపై అవగాహన పెంపొందించడం, మానవతా సేవా భావాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ జనరల్ సెక్రటరీ డా. యేకుల రాజారావు గారు,...