ఎస్ ఐ ఆర్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి...

బిజెపి నియోజకవర్గ బిఎల్ఏ 1 జి.బలరాంరెడ్డి.. నారాయణపేట, జూలై 4 (బి వి కే న్యూస్ ) కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కు ఓటర్లందరూ స్వచ్ఛందంగా తమ ఓటు వివరాలను పూర్తిస్థాయిలో అందజేసి సహకరించాలని బిజెపి మక్తల్ నియోజకవర్గ బిఎల్ఏ 1 జి.బలరాంరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత నెల 25 నుంచి మొదలైన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల 24 వరకు కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా మక్తల్ నియోజకవర్గం లోని అన్ని పోలింగ్ బూతుల పరిధిలో బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 2002 ఓటర్ జాబితా ఆధారంగా...