విద్యార్థులకు నీటి సమస్య పరిష్కారం పచ్చి అబద్ధం.
కమిషనర్ హోదాలో తప్పుడు ప్రకటనలా? - పరిష్కారానికి, ఉచిత సలహాలకు తేడా లేదా?. నారాయణపేట, జూలై 4 (బి వి కె న్యూస్) మక్తల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్యపై అంబేద్కర్ యువజన సంఘం, మానవ హక్కుల నాయకుల ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం సమస్య పరిష్కారానికి విన్నవించిన పత్రికా ప్రకటనను చూసి బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు కలిసి కమిషనర్ నాయకత్వంలో పాఠశాలను సందర్శించడం స్వాగతించాల్సిన విషయమే కానీ కమిషనర్ ఏ హోదాలో అన్ని పార్టీల నాయకులను కౌన్సిలర్లను పాఠశాలకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికై ఏ చొరవ చూపారో కమిషనర్ బహిరంగ ప్రకటన చేయాలి. లేదా అన్ని పార్టీల నాయకులతో...