కొండమల్లేపల్లి 'అర్థగిరి క్షేత్రం' (మల్లెల గట్టు) అభివృద్ధికి బాటలు: 111 మంది సభ్యులతో ట్రస్ట్ ఏర్పాటుకు సన్నాహాలు
దేవరకొండ 04జూలై (BVK 3 న్యూస్ ) : కొండమల్లేపల్లి పట్టణంలో కీర్తిశేషులు స్వర్గీయ కుంభం పుల్లారెడ్డి సుజాతమ్మలు నిర్మించిన ప్రముఖ శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం (అర్థగిరి క్షేత్రం, మల్లెల గట్టు ) మరింత అభివృద్ధి చెందాలంటే ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆలయ శాశ్వత ధర్మకర్త కుంభం మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ఆలయం వద్ద ఏర్పాటుచేసిన సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 111 మంది సభ్యులతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ట్రస్టులో సభ్యత్వం పొందేవారు 33,111 రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందాలన్నారు. ఈనెల జూలై 15 తారీకు లోపు డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే మొదటగా కమిటీలో...