దేవరకొండలో 'వాయిస్-4' శిక్షణ కార్యక్రమం

మహిళా సాధికారతకు నాయకత్వ నైపుణ్యాలే పునాది దేవరకొండ 04జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం నాడు మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించి, సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేయడమే లక్ష్యంగా 'వాయిస్-4' శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత స్వేచ్ఛ నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో పాల్గొన్న మహిళలకు సమాజంలో నాయకత్వ పాత్రను ఎలా పోషించాలి, సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, సమర్థవంతమైన సంభాషణ ద్వారా ప్రజల్లో అవగాహన ఎలా పెంచాలి అనే అంశాలపై నిపుణులు వివరించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకుని...