తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిరిపోతు శ్రీరాములు ఘన సన్మానం

దేవరకొండ 05జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశం హైదరాబాద్‌లోని ఆందోళన మైసమ్మ అమ్మవారి సన్నిధిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి దేవరకొండ పట్టణ శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ మాజీ అధ్యక్షులు సిరిపోతు శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా సిరిపోతు శ్రీరాములు తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో, సంపూర్ణంగా పూర్తి చేశారని కొనియాడారు. చేనేత రంగం అభివృద్ధి కోసం, ఐక్యవేదిక బలోపేతం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి, రాపోలు వీర...