Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండలో అట్టహాసంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు

    Author VENKATESH | 09 Jul 2026, 09:10 PM | నల్గొండ
    దేవరకొండలో అట్టహాసంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు

    దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు 78వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి.
    ఈ సందర్భంగా దేవరకొండ గౌడ్ బాయ్స్ హై స్కూల్ నుంచి జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ మైదానం వరకు విద్యార్థులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి,ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ర్యాలీలో దేశభక్తి నినాదాలు, విద్యార్థి చైతన్యాన్ని ప్రతిబింబించే నినాదాలతో దేవరకొండ పట్టణం మార్మోగింది.
    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ గారు మాట్లాడుతూ 1949 జూలై 9న ఆవిర్భవించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగి దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులను చైతన్యవంతం చేస్తోందన్నారు. గత *78 సంవత్సరాలుగా* విద్యార్థుల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్య కోసం ఉద్యమాలు, జాతీయ పునర్నిర్మాణం, సామాజిక సేవ, నాయకత్వ వికాసం వంటి రంగాల్లో ఏబీవీపీ విశేష సేవలు అందిస్తోందని తెలిపారు."జ్ఞానం శీలం ఏకత" అనే త్రిసూత్రం ఏబీవీపీకి మార్గదర్శకమని, జ్ఞానం వ్యక్తిత్వ వికాసానికి, శీలం సమాజ విశ్వాసానికి, ఏకత దేశ సమగ్రతకు ప్రతీకలని అన్నారు. విద్యార్థి కేవలం ఉద్యోగం కోసం చదివే వ్యక్తి కాకుండా, దేశ భవిష్యత్తును నిర్మించే బాధ్యతగల పౌరుడిగా ఎదగాలని ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, నాణ్యమైన విద్య, పారదర్శక విద్యా విధానం, అవినీతి నిర్మూలన, క్యాంపస్ అభివృద్ధి వంటి అంశాలపై ఏబీవీపీ అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. అలాగే సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సైబర్ సెక్యూరిటీ అవగాహన, డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజంలో విశిష్టమైన సేవలు అందిస్తోందని తెలిపారు.అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వేలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు జైలు శిక్షలను సైతం ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. దేశ సమైక్యత, జాతీయ భద్రత, సరిహద్దుల రక్షణ, అక్రమ చొరబాట్ల నియంత్రణ వంటి జాతీయ అంశాలపై కూడా ఏబీవీపీ ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తోందని పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి యలమల హేమ సుందర్, లింగాల రాకేష్, సంతోష్, దమ్ముజు అమితేష్ , చరణ్, నరేష్,శివ, గణేష్, వినయ్, అబ్దుల్, చేపూరి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.