Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్శిటీతో తెలంగాణ క్రీడా రంగంలో కొత్త శకం ప్రారంభం

    Author VENKATESH | 09 Jul 2026, 09:28 PM | నారాయణపేట
    యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్శిటీతో తెలంగాణ క్రీడా రంగంలో కొత్త శకం ప్రారంభం

    మంత్రి వాకిటి శ్రీహరి
    - పీటీ ఉషా స్ఫూర్తితో తెలంగాణ యువత ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా ముందుకు సాగాలి
    నారాయణపేట, జూలై 9 (బివికె న్యూస్ )
    యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్శిటీ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
    ఈ కార్యక్రమంలో భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా, ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ వీసీ & ఎండీ సోనిబాలా దేవి , క్రీడాకారులు, యూనివర్శిటీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, తాను ఎనిమిదో తరగతిలో చదువుతున్న సమయంలో పీటీ ఉషా దేశానికి పతకాలు సాధించిన వార్తలను పత్రికల్లో చూసి గర్వపడేవారమని అన్నారు. సాధించాలనే సంకల్పం ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదని పీటీ ఉషా తన జీవితంతో నిరూపించారని కొనియాడారు.
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ స్పోర్ట్స్ పాలసీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్శిటీ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. సీఎం కప్‌ను వరుసగా రెండు సార్లు నిర్వహించి గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీస్తున్నారని చెప్పారు. రెండో ఎడిషన్‌లో ఐదు లక్షలకు పైగా చిన్నారులు పాల్గొనడం తెలంగాణ క్రీడా చరిత్రలో విశేషమని పేర్కొన్నారు.
    తెలంగాణ కంటే చిన్న దేశమైన దక్షిణ కొరియా ఒలింపిక్స్‌లో ఎన్నో పతకాలు సాధిస్తోందని, అదే స్ఫూర్తితో తెలంగాణ యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రత్యేక క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నారని మంత్రి వివరించారు.
    ఒకప్పుడు మిల్కా సింగ్ ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని చాటగా, అనంతరం పీటీ ఉషా భారత క్రీడా ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ యువత కూడా అదే స్ఫూర్తితో ప్రపంచ వేదికపై రాణించాలని ఆకాంక్షించారు.
    విద్యార్థులు, యువ క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, "ఆటను కాలక్షేపంగా కాకుండా జీవిత లక్ష్యంగా భావించాలి. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యమవుతాయి. గేమ్‌నే మీ ప్రపంచంగా భావించి పూర్తి నిబద్ధతతో ముందుకు సాగండి" అని పిలుపునిచ్చారు.
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి, తెలంగాణను దేశంలోనే కాక ప్రపంచ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలపాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.