Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కొండమల్లేపల్లిలో ఘనంగా ఏకకుండి గాయత్రీ యజ్ఞం

    Author VENKATESH | 11 Jul 2026, 08:35 PM | నల్గొండ
    కొండమల్లేపల్లిలో ఘనంగా ఏకకుండి గాయత్రీ యజ్ఞం

    దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) :
    కొండమల్లేపల్లి పట్టణంలోని దుర్గా నగర్ కాలనీలో గల శ్రీ ఆంజనేయస్వామి దుర్గామాత ఆలయంలో శనివారం ఏకకుండి గాయత్రీ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం నిర్వహించే గాయత్రి యజ్ఞ కార్యక్రమంలో భక్తుల అదిక సంఖ్యలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరు సన్మార్గంలో పయనించాలని సూచించారు. వర్షాలు బాగా కురిసి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆశించారు. యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అఖిల విశ్వ గాయత్రీ పరివార్ కొండమల్లేపల్లి వారు దుర్గామాత అమ్మవారికి సమర్పించిన చీరను డ్రా ద్వారా అందించారు. డ్రాలో పట్టణానికి చెందిన మంజుల అమ్మవారి చీరను దక్కించుకున్నారు. స్థానిక సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి చేతుల మీదుగా చీరను అందజేశారు. అనంతరం యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీను,గాయత్రి పరివార్ సబ్యలు వింజమూరు చంద్రమౌళి, దాచేపల్లి వెంకటేశ్వర్లు, ఏరుకొండ రాము, నడ్డి శంకర్, నరసింహ, పరశురాం, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.